
పేదల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరుబాట…
కేసీఆర్ హయాంలో నిర్మించిన 2BHK ఇళ్ల కేటాయింపు, 22A సమస్యల పరిష్కారం కోసం తహశీల్దార్ కార్యాలయం ముట్టడి..
మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో దుండిగల్–గండిమైసమ్మ మండల తహశీల్దార్ కార్యాలయంలో ధర్నా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని దుండిగల్–గండిమైసమ్మ మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన విభాగం నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో నిర్మించిన 2BHK ఇళ్లను ఇప్పటికీ కేటాయింపునకు నోచుకోని అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న 22A సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
భూములకు సంబంధించిన సమస్యల కారణంగా అనేక మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అర్హులైన ప్రజలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అనంతరం మండల తహశీల్దార్ (MRO) కి వినతిపత్రం అందజేసి, 2BHK ఇళ్ల కేటాయింపు, 22A సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేపడతామని స్పష్టం చేశారు. పేదల హక్కుల పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
