
బీరప్ప గడ్డ డివిజన్ పరిధిలోని సీతారామ కాలనీలో శ్రీ సీతారాముల ఆలయాన్ని*ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డి శనివారం దర్శించుకున్నారు. *స్థానిక నాయకుడు పల్లె రాజ్ కుమార్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు స్థానికులు, కాలనీవాసులు ఘనస్వాగతం పలికారు.
ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామికి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా ఆయన మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రతీ ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. కాలనీల్లో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందర, ఖాళీ స్థలాలలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పాటు కాలనీ ముఖ్య నాయకులు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు మరియు భక్తులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
