ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవ

Spread the love

ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటుకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి చొరవ

ఉప్పల్ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి వాహనదారులకు సులభతరమైన రాకపోకలు కల్పించేందుకు ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటు కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

ఈ సందర్భంగా MMC కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు కలిసి, నియోజకవర్గంలోని పలు ప్రధాన ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.

ప్రత్యేకంగా:

🔹 కాప్రా
🔹 ఎల్లారెడ్డిగూడ
🔹 కుషాయిగూడ
🔹 రాధిక చౌరస్తా
🔹 హబ్సిగూడ X రోడ్
🔹 నాచారం

ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కమిషనర్ గారిని కోరారు.

ఫ్రీ లెఫ్ట్‌ల ఏర్పాటు ద్వారా ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనదారుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయవచ్చని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సాయి జెన్ శేఖర్ BRS పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top