
SIR-2026 కార్యక్రమంలో BLAలు, సీనియర్ నాయకులకు సన్మానం ||
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ శ్రీమతి మీనాక్షి నటరాజన్ * సూచనల మేరకు బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *SIR-2026 కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో 277 డివిజన్ మహాదేవపురం – సిద్దనోళ్ల సంజీవరెడ్డి, 278 డివిజన్ – డేగల సతీష్ బాబు, 291 డివిజన్ – బట్ట పలకృష్ణ, 293 డివిజన్ – సంతోష్ ముదిరాజ్ డివిజన్లకు చెందిన అధ్యక్షులు, ఇంచార్జులు, కాంగ్రెస్ పార్టీ BLAలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి , DCC కమిటీ సభ్యులు పాల్గొని SIR-2026 కార్యక్రమంలో అంకితభావంతో పనిచేసిన BLAలు, సీనియర్ నాయకులు మరియు డివిజన్ అధ్యక్షులను ఘనంగా సన్మానించారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ, SIR-2026 కార్యక్రమంలో కృషి చేసిన ప్రతి BLA, సీనియర్ నాయకుడు మరియు డివిజన్ అధ్యక్షుడికి శుభాభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే నిబద్ధతతో పనిచేస్తూ కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తలు మరియు నాయకుల సమన్వయంతో ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా SIR-2026లో పార్టీ నాయకులు, BLAలు మరియు కార్యకర్తల సమన్వయంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
