
CMRF ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన డిసిసి ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్‌నగర్‌లో మేడ్చల్–మల్కాజ్గిరి డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను బాధితులకు అందజేశారు.
రమేష్, గాయత్రి, సత్తార్, సైదారత్న, హేమలత, సంగీత, ప్రకాష్, నవత, శంకర్ తదితరులకు మంజూరైన మొత్తం రూ.4,20,000 విలువైన చెక్కులను షాపూర్‌నగర్‌లోని తన నివాసంలో బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. నిరుపేదలు అనారోగ్యానికి గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పేద కుటుంబాలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించడంలో సీఎంఆర్ఎఫ్ కీలకంగా నిలుస్తోందన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు కి కృతజ్ఞతలు తెలియజేశారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిమ్మి దేవేందర్, బుచ్చిరెడ్డి, బాలప్ప, యంసాగర్, మోతే శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయులు ముదిరాజ్, ఆర్వ వెంకట్ రమణ, శ్రీరాములు,సలీం, చందు గౌడ్, ప్రభాకర్ రెడ్డి, సలీం, శంకర్ గౌడ్, చోటు, రఘు, రాజి రెడ్డి, రామగిరి రాకేష్,రిజ్వాన్, నవాజ్ తదితరులు పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
