సారపాకలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Spread the love

సారపాకలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

సారపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక సెంటర్‌లో సాయంత్రం బూర్గంపాడు ఎస్సై మేడా ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వాహనదారులను ఆపి వాహనాల పత్రాలను పరిశీలించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్సై మేడా ప్రసాద్ వాహనదారులకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
రోడ్డు భద్రతా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్సై కోరారు.

You cannot copy content of this page

Scroll to Top