
చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వెంకటేష్ గౌడ్
తెలంగాణ సాయుధ పోరాటంతో తనదైన శైలిలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఉమ్మడి ఆల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వారి కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికీ ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ కాలంలోనే హక్కుల సాధన కోసం న్యాయస్థానాల్లో చట్టపరమైన పోరాటం చేసిన ప్రజాస్వామిక వాది ఐలమ్మ అని గుర్తుచేశారు. నాడు ఐలమ్మ ప్రదర్శిందిన స్ఫూర్తి, తెలంగాణ సాధనలోనూ, అనంతర ప్రగతి ప్రస్థానంలోనూ ఇమిడి ఉందని తెలియచేసారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, గోపాల్, పోశెట్టిగౌడ్, మల్లేష్, ఖలీమ్, నరసింహ, సుధ, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
