వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు కాలేదు – ప్రతి ఇంటికి ‘బాకీ కార్డు’ : మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు.

Spread the love

వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు కాలేదు – ప్రతి ఇంటికి ‘బాకీ కార్డు’ : మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రజలకు ఇచ్చిన 420 హామీలు మరియు ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చి, వెయ్యి రోజులు (1000)గడిచినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ప్రభుత్వం ప్రజలకు బాగ్గిపడ్డ కార్డులను రిక్షా పుల్లర్స్ కాలనీ లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి బాకీ కార్డులను పంచిన మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు .

ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీలు, 100 రోజుల్లో అమలు చేస్తామని ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మి అధికారాన్ని అప్పగించారని అన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి సుమారు వెయ్యి రోజులు గడుస్తున్నా అనేక హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు.

మహిళలకు, రైతులకు, యువతకు, నిరుద్యోగులకు, పేదలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే ప్రతి ఇంటికి వెళ్లి ‘బాకీ కార్డులు’ అందిస్తున్నామని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గొట్టుముక్కల పెద్ద భాస్కరరావు, బాబురావు, ఆంజనేయులు , వెంకన్న,ప్రవీణ్ ,విక్రమ్,కిరణ్,రవి,శానప్ప,రాజు,శేఖర్,యాదగిరి, రాము,ఆనంద్, రాజు, నాగేష్, గిల్బర్, జగదీష్,చందు,రామ్మూర్తి, శైలజ, రామ్మూర్తి, హరి,కుమార్, శ్రీనివాస్, టీచర్ బాబురావు, చంద్రయ్య,దూపల్లి కుమార్, పింటూ, సంతోష్, బాబు, వెంకన్న, జై, రాజు, నరేష్, నరసింహ, నవీన్, బద్రి, టిల్లు,వినయ్, హరీష్, వినోద్, స్టాలిన్ , భరత్ ,తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top