కొలన్ సులోచన మృతికి సురేష్ రెడ్డి,మంత్రి సత్యనారాయణ సంతాపం

Spread the love

కొలన్ సులోచన మృతికి సురేష్ రెడ్డి,మంత్రి సత్యనారాయణ సంతాపం

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి మాతృమూర్తి, కీ.శే. కొలన్ సులోచన నిన్న అకాల మరణం చెందడంతో, ఆయన నివాసానికి పలువురు ప్రముఖులు విచ్చేసి సంతాపం తెలిపారు.

ఈ సందర్భంగా సుభాష్ నగర్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి మరియు సూరారం మాజీ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ కొలన్ హన్మంత్ రెడ్డి ని పరామర్శించి, సులోచనమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

సులోచన మృతి పట్ల వారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు

ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top