
శ్రీ విశ్వకర్మ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహణ
శ్రీ విశ్వకర్మ పూజ భక్తిశ్రద్ధలతో నిర్వహణ….
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి రామగుండం, : రామగుండం మరియు తెలంగాణ ప్రాజెక్టు ప్రాంగణంలో సెప్టెంబర్ 17న. శ్రీ విశ్వకర్మ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు, హోమం నిర్వహించారు.
ప్రాజెక్టు కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని, శ్రీ విశ్వకర్మ స్వామిని ప్రార్థిస్తూ సుఖసంతోషాలు, సిరిసంపదలు, భద్రతతో పాటు పనుల్లో ఉత్తమ ఫలితాలు కలగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మహాప్రసాదం పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
