రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు దోచుకు తింటున్నారు..

Spread the love

రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు దోచుకు తింటున్నారు..

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు.

సర్వేలన్నీ జగన్ మోహన్ రెడ్డి కె మద్దతుగా ఉన్నాయి.

ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు.

జగన్ పాలనలో అందరూ సుభిక్షంగా ఉండేవారు.

కొడవలూరు లో వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి..

కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, తండ్రీ కొడుకులైన చంద్రబాబు లోకేష్ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం కొడవలూరులో వైసిపి విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి పాలనలో ఐదేళ్లు ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు, మహిళలు, అందరూ సుభిక్షంగా ఉన్నారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. మూడువేల లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి ది అని అన్నారు. సర్వేలన్నీ జగన్మోహన్ రెడ్డి కే మద్దతుగా ఉన్నాయని, ఈసారి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయటం ఖాయమని అన్నారు. కొన్ని పచ్చ మీడియా పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి పై అసత్య రాతలు రాస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల కురుక్షేత్రం మొదలవుతుందని ప్రతి ఒక్కరూ ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్లలో కొడవలూరు మండలంలో 278 కోట్ల అభివృద్ధి పనులు చేసామన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త గర్వంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గురించి తెలియజేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కొండూరు అనిల్ బాబు గొల్లపల్లి విజయ్ కుమార్, కొడవలూరు మండల అధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, కాటంరెడ్డి నవీన్ రెడ్డి, మావులూరు శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ గాలి జ్యోతి, సతీష్ రెడ్డి, అనపల్లి ఉదయ భాస్కర్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top