తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Spread the love

తిరుమలలో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు

మోహినీ అవతార వాహనసేవలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం ఉదయం మలయప్పస్వామివారు జగన్మోహనాకారంలో మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాలంకార భూషితుడై, తిరుచ్చిపై శ్రీకృష్ణుడి అలంకారంలో తిరుమాడ వీధుల్లో విహరించారు. శ్రీవారి మోహినీ అవతార వాహనసేవలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమాడ వీధుల్లో గజరాజులు ముందుగా నడుస్తుండగా, భక్తబృందాల భజనలు, కోలాటాలు, జీయ్యంగార్ల ఘోష, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా సాగిన స్వామివారి పల్లకీసేవను, అలాగే ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను వేమిరెడ్డి దంపతులు వీక్షించారు.

You cannot copy content of this page

Scroll to Top