స్థానిక ఎన్నికలే లక్ష్యం.. గెలుపే ధ్యేయంగా పనిచేయాలి: మాజీ మంత్రి నల్లపరెడ్డి..

Spread the love

స్థానిక ఎన్నికలే లక్ష్యం.. గెలుపే ధ్యేయంగా పనిచేయాలి: మాజీ మంత్రి నల్లపరెడ్డి..

స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మాజీ మంత్రివర్యులు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.విడవలూరు సాయిబాబా కళ్యాణమండపంలో మండల పార్టీ అధ్యక్షులు కాటంరెడ్డి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విడవలూరు మండల పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని, గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.

కూటమి ప్రభుత్వ విధానాలు, పాలనపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని అన్నారు.గ్రామ, వార్డు స్థాయిలో ఇంటింటికీ వెళ్లి జగనన్న ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు, ప్రస్తుత ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు.అనంతరం వైసీపీ పార్టీ గుర్తింపు ID కార్డులను తన చేతుల మీదుగా వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలకు అందజేశారు.ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, వైసీపీ సీనియర్ నాయకులు కొండూరు వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అనిల్ బాబు, APLDA ఛైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు మావులూరు శ్రీనివాసులు రెడ్డి, బుచ్చి రూరల్ అధ్యక్షులు చెర్లో సతీష్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల ఇంచార్జ్ కొండూరు లక్ష్మీనారాయణ రెడ్డి, YSRTUC నియోజకవర్గ అధ్యక్షులు బిరదవోలు రూప్ కుమార్ రెడ్డి, వైసీపీ నాయకులు తిక్కవరపు జనార్దన్ రెడ్డి, పొన్నవోలు కృష్ణారెడ్డి, బుచ్చింగారి తిరుపతయ్య, అనపల్లి భాస్కర్ మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top