
గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గంలోని చంద్రగిరి నగర్, మారుతీనగర్, సంజయ్ గాంధీ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు. మండపాల నిర్వాహకుల ఆహ్వానం మేరకు గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, వెలుగులు నిండాలని ఆకాంక్షించారు.
అనంతరం మండపాల నిర్వాహకులు కూన శ్రీశైలం గౌడ్ కి శాలువాతో ఘనంగా సన్మానించారు.
అదేవిధంగా గాజులరామారం పరిధిలోని మెట్కన్గూడలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ హీరాలాల్ స్వీట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై షాపును ప్రారంభించారు.
అనంతరం షాప్ నిర్వాహకులు మార్వాడీ సాంప్రదాయ పద్ధతిలో ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ షాప్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన స్వీట్లు అందిస్తూ వారి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో గణేష్ మండపాల నిర్వాహకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
