
భద్రగిరి మార్ట్ లో లభించే ఆర్గానిక్ సేంద్రీయ ఉత్పత్తులు చాలా బాగున్నాయి
గిరిజనులకు ఆర్థిక చేకూర్పుకు భద్రగిరి మార్ట్ అందుబాటులోకి తేవడం ప్రశంసనీయం
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
అడవులలో దొరికే అటవీ ఉత్పత్తులు, సేంద్రియ ఆర్గానిక్ ఉత్పత్తులు, ఎస్ హెచ్ జి గిరిజన మహిళలకు ఆర్థికంగా చేయూత అందించడానికి ఎంతో దూర దృష్టితో భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ కృషితో ఏర్పాటు చేసిన భద్రగిరి మార్ట్ చాలా అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా పిఓ ను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
భద్రాచలం పట్టణంలోని భద్రగిరి మార్ట్ ను ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులతో కలిసి ఆయన సందర్శించి మార్ట్ లోని అటవీ ఉత్పత్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగకరమైన అనేక అటవీ వస్తువులను ఈ మార్ట్ లో అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరమని, ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
ఎస్ హెచ్ జి గిరిజన మహిళలు మరియు ఆర్గానిక్ పంటలు పండించే గిరిజన రైతుల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ను కల్పించడంతోపాటు స్థానిక గిరిజన కుటుంబాలకు ఆర్థిక బలాన్ని అందించే సదాశయంతో ఏర్పాటు చేసిన ఈ మార్టును స్థానికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు.
భద్రగిరి మార్ట్ లో అందుబాటులో ఉంచిన గిరిజనుల సాంప్రదాయ ఉత్పత్తులు, వారి ప్రతిభకు సరైన గుర్తింపు ఇవ్వడం, అలాగే వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ మార్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, భద్రాచలం ప్రజలు గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేసి, గిరిజన ఎస్ హెచ్ జి గ్రూప్ మహిళలు, గిరిజన రైతులకు ఆర్థికంగా చేయూత అందించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు, భద్రగిరి మార్ట్ మేనేజర్ జయరాజ్, విజిలెన్స్ కమిటీ మెంబర్ వెంకటేశ్వర్లు, భద్రగిరి మార్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
————అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయము భద్రాచలం నుండి జారీ చేయడం అయినది——
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
