
సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే జారె
యాతాలకుంట టన్నెల్ పనుల పర్యవేక్షణ.. చాపరాలపల్లి వద్ద హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన
అశ్వారావుపేట: సీతారామ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, మార్కెటింగ్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం వివిధ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.
ముందుగా యాతాలకుంట వద్ద కొనసాగుతున్న సీతారామ ప్రాజెక్టు టన్నెల్ నిర్మాణ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల వివరాలను అధికారులు వారికి వివరించారు.
అనంతరం ములకలపల్లి మండలం చాపరాలపల్లి వద్ద నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్ శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.
తదుపరి కమలాపురం వద్ద నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంప్హౌస్ను మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. సీతారామ ప్రాజెక్టు పనుల ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి, రైతులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
