గణనాథులనీ దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ

Spread the love

గణనాథులనీ దర్శించుకున్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ సర్కిల్ బహదూర్ పల్లి డివిజన్, బౌరంపేట్ డివిజన్, మరియు కొంపల్లి సర్కిల్ దూలపల్లి డివిజన్ ప్రాంతాల్లో వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కౌన్సిలర్లు నర్సింగం భారత, డప్పు కిరణ్, చింతల దేవేందర్ యాదవ్, మాజీ పాక్స్ డైరెక్టర్లు అర్కల జీతయ్య, చింతల మధు, నాయకులు సగ్గుడి శ్రీనివాస్, బర్మా రాజు, చింతల పవన్, రుషిరాజ్, చందు, యువ నాయకులు మైసిగారి శ్రీకాంత్, శివ యాదవ్, మంత్రి రఘునాథ్, శ్రవణ్, యాదగిరి, టీంకు, వరాల రామ్, రాజేష్, వెంకట్, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top