
ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి : తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల,తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
భద్రాద్రి జిల్లా పవిత్రమైన ప్రాంతం.. శ్రీసీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి
వివిధశాఖల అధికారుల నుంచి వివరాలు తోపాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నివేదిక అడిగి తెలుసుకున్న రాష్ట్ర కమిషన్ చైర్మన్
భద్రాద్రి గిరి మార్ట్ ఏర్పాటు ఆదర్శంనీయం.. ఐటీడీఏ పీవో రాహుల్ ను అభినందించిన కమిషన్ చైర్మన్
భద్రాద్రి జిల్లా ఐ.డీ.ఓ.సీ లో ల్యాండ్, సర్వీస్( ఆర్.ఓ.ఆర్), అట్రాసిటీస్ అంశాలపై ముగ్గురు కమీషన్ సభ్యులతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం
అనంతరం న్యాయంకోసం వచ్చిన ఎస్సీ, ఎస్టీ బాధితుల నుంచి దరఖాస్తులను స్వీకరించి అధికారులకు రిఫర్ చేసిన రాష్ట్ర కమిషన్ చైర్మన్
ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేస్తూ, రక్షణ చట్టాలను రూపొందించిందని
తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల, తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సోమవారం భద్రాద్రి జిల్లా ఐ.డీ.ఓ.సీ లో ల్యాండ్, సర్వీస్( ఆర్.ఓ.ఆర్), అట్రాసిటీస్ అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం ముగ్గురు కమీషన్ సభ్యులతో కలిసి నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అతి పెద్ద ఏజెన్సీ జిల్లా భద్రాద్రి జిల్లా అని గుర్తుచేశారు. కమిషన్ సమావేశానికి జిల్లాకు రెండోసారి రావడం జిల్లా అధికారులు ఘనస్వాగతం పలకడం మర్చిపోలేని సంఘటనని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, వాటిని అందిపుచ్చుకొని ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందాలని సూచించారు. వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీల భూమి సమస్యలు, బ్యాక్ లాగ్ పోస్టులు వివరాలు, ఉద్యోగులు రక్షణ కోసం చట్టాలను, రోస్టర్ విధానాలు,రూపొందించి వాటిని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిషన్ చర్యలు చేపడుతుందని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజల పైన ఉద్యోగులపైన ఎటువంటి వేధింపులు కానీ చిత్రహింసలు గాని ఇబ్బందులు గురి చేసిన శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ చైర్మన్ హెచ్చరించారు. న్యాయం కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ బాధితులకు ఎఫ్.ఐ.ఆర్, చార్జిషీట్, కమిషన్, కంపన్సేషన్ వరకు పారదర్శకంగా ఉండేందుకు అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
భద్రాద్రి జిల్లాకు శ్రీ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని, ఎన్నీ సమస్యలు ఉన్న వాటి పరిష్కారం ఆ రాములోరి దయ వలన సత్వరమే తీరిపోతాయని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. దక్షిణ అయోధ్యగా పేరు గడించిన భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం ఎంతో భాగ్యంమన్నారు.
అదేవిధంగా వివిధశాఖల అధికారుల నుంచి వివరాలు తోపాటు ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నివేదిక రాష్ట్ర కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో భద్రాద్రి జిల్లా పోలీస్ శాఖ నివేదికను కమిషన్ చైర్మన్ అడుగగా 2014 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 1115 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వివరించారు. అందులో 51 కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయని, వాటిలో 20 కేసులో చార్జింగ్ చార్జిషీట్ చేశామని, రెండు హైకోర్టు స్టేలు ఉండగా, 9 కేసులు లీగల్ ఒపీనియన్ కోసం ఉన్నాయని, 20 పెండింగ్ కేసులు ప్రస్తుతం ఉన్నట్లు జిల్స్ ఎస్పీ వివరించారు.
ఈ క్రమంలోనే జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ, జిల్లా పంచాయతీ, డీ.ఆర్.డీ.ఓ, ఎస్సీ కార్పొరేషన్, గురుకులాల, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జిల్లా ప్రజా పరిషత్, ఉపాధి శాఖ మున్సిపల్ శాఖ, వ్యవసాయ శాఖ, పరిశ్రమలు, విద్యుత్, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, పంచాయితీ రాజ్, ఆర్ అండ్ బి, ఎక్సైజ్ జ్యోతిరావు పూలే డిసిఓ, జిల్లా రెవెన్యూ, ఫారెస్ట్, ఐటీడీఏ లో నమోదైన ఎస్సీ ఎస్టీ కేసుల వివరాలు ఉద్యోగుల సమస్యలు ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య భర్తీ కానీ బ్యాక్లాగ్ పోస్టుల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ ల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని వారి అభ్యున్నతే లక్ష్యంగా వివిధ పథకాల అమలుకు కృషిచేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల తాహసిల్దార్లు, ఎంపీడీవోలు, సిడిపివోలు సమన్వయంతో జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ ల సమస్యల పరిష్కారానికి న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితుల కోసం పని చేయాలని ఆదేశించారు.
భద్రాద్రి గిరి మార్ట్ ఏర్పాటు ఆదర్శంనీయమని కమిషన్ చైర్మన్ భద్రాచలం ఐటిడిఏ పిఓ రాహుల్ ను అభినందించారు. గిరిజన మహిళా సంఘాల ఆధ్వర్యంలో వారి సాంప్రదాయ వృత్తి ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా భద్రాచలంలో ఈ గిరిమార్టును ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. వారి ఉత్పత్తులు ను ఏర్పాటు చేసి, గిరిజనుల జీవనశైలి విధి,విధానాలను కళ్ళకు కట్టే విధంగా చూపించిన మ్యూజియం అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. వారు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్ చేస్తు ప్రోత్సహిస్తు చర్యలు చెప్పట్టడం, ఇలాంటి మార్పులను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
అనంతరం న్యాయంకోసం వచ్చిన ఎస్సీ, ఎస్టీ బాధితుల నుంచి కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్,నీలాదేవి,డీ.బీ.ఎఫ్ శంకర్ లతో కమిషన్ చైర్మన్ వెంకటయ్య
దరఖాస్తులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు రిఫర్ చేసి ఎటువంటి నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించకుండా తక్షణమే సమస్యలు పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తొలుత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్యకు భద్రాద్రి పోలీస్, ఏ.ఆర్ విభాగాల ఆధ్వర్యంలో గాడ్ ఆఫ్ హనర్ ఏర్పాటు చేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వేణుగోపాల్, భద్రాచలం ఐటిడిఏ పి.ఓ రాహుల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన,డీ. ఆర్.ఓ పద్మావతి, సిపిఓ సునీత, జిల్లా షెడ్యూలు కులముల అధికారిని శ్రీలత, కార్పొరేషన్ ఈ.డీ ఉపేందర్,జడ్పీ సీఈఓ నాగలక్ష్మి,డీపీఓ అనూష, డీ.ఏ.వో బాబురావు, విద్యుత్ శాఖ ఈ వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
