
భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన శోభాయాత్రలు నిర్వహించాలి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ *
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ సర్కిల్ లోని శంభీపూర్, మల్లంపేట్, బౌరంపేట్ సింహపురి కాలనీ ప్రాంతాల్లో వివిధ కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక నిమజ్జన శోభాయాత్రను భక్తి శ్రద్ధలతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని యువతకు, నిర్వాహకులకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాని వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
