చాలా నెలల తరువాత… ఏపీ సీఎం నారా చంద్రబాబు

Spread the love

చాలా నెలల తరువాత… ఏపీ సీఎం నారా చంద్రబాబు డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కల్యాణ్ …ఒకే ఫ్రేమ్ లో….ఇద్దరూ ఉత్సాహంగా క్యాబినెట్లో!


ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య తరచుగా కేబినెట్ భేటీలకు గైర్హాజరు కావడం, సీఎం చంద్రబాబు హాజరవుతున్న ప్రధాన కార్యక్రమాలకు కూడా రాకుండా దూరంగా ఉండిపోతుండటంతో వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావతి సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ భేటీకి పవన్ కళ్యాణ్ చాలా కాలం తర్వాత హాజరయ్యారు. అంతే కాదు సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా కనిపించారు. దీంతో రూమర్లకు చెక్ పడింది.

ఈమధ్యే ముంబై, కేరళ వెళ్లి వరుసగా చికిత్సలు చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండురోజులుగా పిఠాపురం పర్యటనలో ఉన్నారు. ఇది ముగించుకుని ఇవాళ ఉదయం అమరావతిలో కేబినెట్ భేటీకి (AP Cabinet Meet) హాజరయ్యారు. ఓవైపు స్దానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు, అంతకు ముందే కేబినెట్ భేటీలకు రాకుండా దూరంగా ఉండిపోవడంతో జరుగుతున్న చర్చకు ఇవాళ ఆయన చెక్ పెట్టారు.

కేబినెట్ భేటీ కోసం సచివాలయానికి వచ్చిన పవన్ కళ్యాణ్ .. సీఎం చంద్రబాబుతో కలిసి మంత్రివర్గ సమావేశం జరిగే ఛాంబర్ కు వచ్చారు. దారిలో ఇద్దరూ ఉత్సాహంగా మాట్లాడుకుంటూ కనిపించారు. చాలా కాలం తర్వాత పవన్ రావడంతో ఆయన ఆరోగ్యంతో పాటు ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు ఆరా తీసినట్లు తెలుస్తోంది. అనంతరం కేబినెట్ భేటీలోకి వెళ్లి పవన్ కళ్యాణ్ తన సీట్లో కూర్చున్నారు. తర్వాత కేబినెట్ భేటీ యథావిధిగా కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ చోటు చేసుకున్న ఈ పరిణామాలు సహజంగానే కూటమి పార్టీలతో పాటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

You cannot copy content of this page

Scroll to Top