అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మధ్య వినాయకుని ఊరేగింపును ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్

Spread the love

అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలం మధ్య వినాయకుని ఊరేగింపును ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్ర ప్రసాద్

ఉయ్యూరు పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా సుందరమ్మపేట, హై స్కూల్ బజారు లోనిర్వహించిన వినాయకుని ఊరేగింపు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ముందుగా వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అనంతరం ఊరేగింపును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…

వినాయకుడి ఆశీస్సులతో ఉయ్యూరు ప్రాంత ప్రజల సహకారంతో ఉయ్యూరు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, పట్టణంలో మౌలిక వసతుల మెరుగుదల తో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బూరెల నరేష్, వ్యాపారవేత్త జిత్తు,కోడూరు వెంకటేష్,అరిగే ఫణి కుమార్, పరుసురామయ్య కోడూరు,గోవర్ధనరావు,మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top