సత్తుపల్లి నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి నిధులు

Spread the love

సత్తుపల్లి నియోజకవర్గంలోని సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ విజ్ఞప్తి

హైదరాబాద్ – సచివాలయం

సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ,బీసీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు విద్యార్థుల భద్రతకు అవసరమైన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి దయానంద్ హైదరాబాద్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనారిటీ హాస్టళ్ల పరిస్థితులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

విద్యార్థులకు సురక్షితమైన, మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు.

You cannot copy content of this page

Scroll to Top