రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సన్నాహక సమావేశం జరిగింది.

Spread the love

రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు గారి అధ్యక్షతన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 సన్నాహక సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తదితరులు హాజరయ్యారు.

2026 డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026 ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సదస్సును ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, దేశీయ, అంతర్జాతీయ రోడ్‌షోల ద్వారా భారీగా పెట్టుబడులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ కీలక మైలురాయిగా నిలవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లను వార్‌రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

You cannot copy content of this page

Scroll to Top