కాంగ్రెస్ కరెంట్‌ కుట్రలను బయటపెడతాం: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన

Spread the love

కాంగ్రెస్ కరెంట్‌ కుట్రలను బయటపెడతాం: సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన

కాంగ్రెస్ ప్రభుత్వ కరెంట్‌ కుట్రలను బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం హైదరాబాద్‌లోని సింగరేణి హెడ్ ఆఫీస్‌ను సందర్శించింది.

ఈ బృందంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద , ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు , దాసోజు శ్రవణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్యే దివాకర్ , టీజీబీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సింగరేణి కార్యాలయం వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు, అధికారుల వైఖరికి నిరసనగా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

You cannot copy content of this page

Scroll to Top