
ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతికి పరిష్కారమే లక్ష్యం
ప్రజాదర్బార్ నిర్వహించిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
కోవూరు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారమే ప్రాధాన్యంగా పనిచేస్తున్నామని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను ఆమె స్వయంగా స్వీకరించారు. ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజల సమస్యల వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే ఫోన్‌లో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిగిలిన విజ్ఞప్తులను తగిన పరిశీలన కోసం అధికారులకు పంపించారు. ప్రజాదర్బార్ ద్వారా క్షేత్రస్థాయి సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, వాటి పరిష్కారానికి అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి వినతికీ సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా కృషి చేస్తామన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
