గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

Spread the love

గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ రాయదుర్గ్‌లో గణేష్ మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తో కలిసి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మండప కమిటీ సభ్యులు కూన శ్రీశైలం గౌడ్ ని మరియు మెట్టు సాయికుమార్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.

అదేవిధంగా గాజులరామారం సర్కిల్ పరిధిలోని మెట్కన్ గూడలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి ఆహ్వానం మేరకు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ నిమజ్జన కార్యక్రమ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో నేమూరి రాములు గౌడ్ , నరేష్ గౌడ్, రాకేష్ గౌడ్ లతో పాటు స్థానిక నాయకులు అంజి ముదిరాజ్ తదితరులు, స్థానికులు మరియు భక్తులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top