
మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ జనరల్ సెక్రటరీలుగా సోల్మన్ రాజు, కోడమగుండ్ల అమృతయ్య ||
బాచుపల్లి: మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్‌మెంట్ జనరల్ సెక్రటరీలుగా సోల్మన్ రాజు , కోడమగుండ్ల అమృతయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం హన్మంతన్న సోల్మన్ రాజు , కోడమగుండ్ల అమృతయ్య ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతనంగా నియమితులైన జనరల్ సెక్రటరీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
