
సుపతం హోటల్స్ మరియు బ్యాంకెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ గండిమైసమ్మ – డీ.పోచంపల్లి నూతనంగా ఏర్పాటు చేసిన సుపతం హోటల్స్ మరియు బ్యాంకెట్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుపతం హోటల్స్ మరియు బ్యాంకెట్ హాల్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన ఈ సంస్థ మంచి ఆదరణ పొందుతూ విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన ఆతిథ్య సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించాలని, వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని నిర్వాహకులకు సూచించారు. స్థానికంగా కొత్త వ్యాపారాలు ప్రారంభం కావడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, నిర్వాహకులు, మరియు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
