
గణనాథుని ఆశిషులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాదేవపురం 277వ డివిజన్లో మహాదేవపురం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కాలనీలో ఏర్పాటు చేసిన గణనాథుడిని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని విఘ్నేశ్వరుడిని వేసుకున్నట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యత, భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తాయని అన్నారు. అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో బౌరంపేట్ పాక్స్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, మహాదేవపురం అసోసియేషన్ కాలనీ ప్రెసిడెంట్ వెంకట రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి, 125 డివిజన్ ప్రెసిడెంట్ విజయరాం రెడ్డి, మాజీ కౌన్సిలర్లు మురళి యాదవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, కమలాకర్, తెలంగాణ సాయి, మాజీ ప్యాక్ డైరెక్టర్ పర్శ శ్రీనివాస్, కాలనీ జనరల్ సెక్రెటరీ దుగ్గిల ప్రసాద్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు సాయిబాబా, అజయ్ ప్రసాద్ గుప్తా, నగేష్, గాలి పోచమ్మ నరసింహ, శివ నాయక్, గౌస్, భాస్కర్, పవన్, అనిల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, దిలీప్, చందు, మరియువారి కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, యువకులు, మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
