
295 బౌరంపేట్ డివిజన్ బీజేపీ ఆధ్వర్యంలో అంత్యోదయ స్పూర్తి ప్రదాత ఏకాత్మ మానవత వాద సిద్ధాంత సృష్టికర్త పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ,డా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తో కలిసి ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు రెండు జెండాలు ఇద్దరు ప్రధానులు ఉండరాదని నినదించి ఉద్యమించి దేశ హితం కోసం జనసంగ్ స్థాపించిన మహనీయులు
అదేవిధంగా అంత్యోదయ అనగా దేశంలో ఉన్నటువంటి చిట్టచివరి వ్యక్తికి ప్రతి అభివృద్ధి ఫలాలు అందాలనే ఆయన ఆశయం
మనిషి శరీరం మనసు బుద్ధి, జ్ఞానం అన్ని ఆత్మ అభివృద్ధి జరగాలి కేవలం డబ్బు మాత్రమే కాదు అప్పుడే ఏకాదత్మ మానవతవాదం సిద్దించినట్టు అవుతుందని
సమాజంలో చివరి వ్యక్తి అభివృద్ధి దేశం నిజమైన అభివృద్ధిఅన్నారు పండిట్ దీన్దయాల్ గారు ఆయన జయంతిని
జాతీయ అంత్యోదయ దివాస్ గా కూడా చెప్పుకుంటారు
వారు కన్న కలలను నేడు దేశ ప్రధాని ప్రియతమ నేత భరత మాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ నిజం చేస్తున్నారు ఇది దేశం గర్వించదగ్గ విషయమని
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియజేసిన బీజేపీ నాయకులు
పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి పురస్కరించుకొని అంగన్వాడీ టీచర్ల సేవలను గుర్తిస్తూ బౌరంపేట్ 1,2,3 అంగన్వాడీ టీచర్లు కట్ట సరిత, కుమ్మరి లలితా భాయి,ఉషశ్రీ లను శాలువాతో సన్మానించి వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో 295 బౌరంపేట్ డివిజన్ బిజెపి అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు కొమ్ము మంగమ్మ జిల్లా కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు గోనె మల్లారెడ్డి,డివిజన్ ప్రధానకార్యదర్శి డి సీతారాంరెడ్డి, అసెంబ్లీ బీసీ మోర్చా కో కన్వినర్ ఆర్ నర్సింహా చారి,మాజీ వార్డు సభ్యులు ఆకుల సత్యనారాయణ,సీనియర్ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి, ఎం జంగారెడ్డి, ప్రవీణ్ రెడ్డి అవినాష్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
