యువత భగత్ సింగ్ లా ధైర్యంగా పోరాడాలి.

Spread the love

యువత భగత్ సింగ్ లా ధైర్యంగా పోరాడాలి.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ పిలుపు.
స్వతంత్ర సమరయోధుడు విప్లవం యువకిశోరం 119వ జయంతి సందర్భంగా నేడు అఖిల భారత యువజన సమైక్య (ఏఐవైఎఫ్) ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట మరియు ముక్దుం నగర్ లోని భగత్ సింగ్ విగ్రహాల వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ వారిని క్షమాభిక్ష అడిగితే భగత్ సింగ్ ఉరి శిక్ష రద్దయ్యేదని కానీ దేశం స్వాతంత్రం కంటే తన ప్రాణం ముఖ్యమైనది కాదని భావించి కొడతాడు ఈ దేశ స్వతంత్రం కోసం తన ప్రాణాలు నడిపించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులకు స్ఫూర్తిగా నిలిచారని అలాంటి భగత్ సింగ్ కళలు కన్నట్లుగా భారతదేశం నేడు లేదని కావున భగత్ సింగ్ ఆశయాలను ఆదర్శాలను నేటి యువత తెలుసుకొని ఈ దేశంలో సమసమాజ నిర్మాణం కోసం అసమానతలు లేని భారతదేశ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నేడు కొంతమంది క్షమాభిక్ష అడిగిన వాళ్ళను పొగుడుతున్నారని అలాంటివారు ఎలా స్వతంత్ర సమరయోధులు అవుతారని వాళ్ళ వారసులుగా చెప్పుకునే వాళ్ళు కూడా క్షమాభిక్ష కోరిన వారిని తమ నాయకుడిగా పీల్చుకోవడం సిగ్గుచేటని అన్నారు.


అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏసురత్నం మరియు సిపిఐ మండల కార్యదర్శి కే స్వామిలు మాట్లాడుతూ యువత నిరాశ చెందకుండా ఢిల్లీలో జరిగిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని బిజెపి ఆర్ఎస్ఎస్ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండ కట్టితేనే మంచి భవిష్యత్తు ఉంటుందని కావున యువత మత్తుకు బానిస కాకుండా, మత విద్వేష రాజకీయాలకు గురికాకుండా మంచి రాజకీయాలు చెయ్యాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ మండల అధ్యక్ష కార్యదర్శులు ప్రవీణ్ మరియు కీర్తి నాయకత్వం వహించగా, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు హైమావతి, ఏఐటీయుసీ కార్యదర్శి శ్రీనివాస్ సిపిఐ మండల సహాయ కార్యదర్శి రాములు ప్రజానాట్యమండలి అధ్యక్షులు బాబు మాజీ కార్యదర్శి వెంకటేష్ శాఖా కార్యదర్శులు సహదేవరెడ్డి, నరసయ్య ఏఐవైఎఫ్ నాయకులు సురేష్, విజయ్, మహేందర్, శ్రీనివాస్ సిపిఐ నాయకులు ఇమామ్, చారి, తెలంగాణ సోమన్న తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top