ఎన్‌టీఆర్ నగర్‌లో(దర్బార్ మైసమ్మ బస్తీ) లొ రూ.27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

Spread the love

ఎన్‌టీఆర్ నగర్‌లో(దర్బార్ మైసమ్మ బస్తీ) లొ రూ.27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

కుత్బుల్లాపూర్: రోడమేస్త్రి నగర్ డివిజన్ పరిధిలోని ఎన్‌టీఆర్ నగర్ దర్బార్ బస్తీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.27 లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించలేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల నిర్మాణంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు మెరుగైన సౌకర్యం కలగనుంది.

ఈ కార్యక్రమంలో KKM ట్రస్ట్ అధినేత, మేడ్చల్–మల్కాజ్‌గిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ తో పాటు స్థానిక డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమస్తా మధుసూదన్ మరియు బస్తీ వాసులు సత్యనారాయణ, ప్రసాద్, రమేష్, వేణు, శ్రీను, అలీ, స్థానిక కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు కాజా, బలరాం, రాజిరెడ్డి, రఘు రెడ్డి, రజాక్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top