
మేడ్చల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం ||
మేడ్చల్: ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ధోరణికి వ్యతిరేకంగా, SIR ప్రక్రియలో జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొన్న అక్రమాలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన కార్యక్రమం జరిగింది.
మేడ్చల్ చెక్పోస్ట్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి మేడ్చల్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కుల రక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ కమిటీ సభ్యులు ముత్యం రెడ్డి, మేకల ఎల్లయ్య, మాజీ కార్పొరేటర్ కొలన్ వీరేందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మా రెడ్డి, రషీద్ బేగ్, క్రిష్ణ గౌడ్, మాజీ సర్పంచ్ కావలి గణేష్, డివిజన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, అర్కల విజయ్ గౌడ్, వారగాని వాసు, జలీల్ ఖాన్, రాజు చారి, చందు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఓటర్ల హక్కులను కాపాడటంతో పాటు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించే విధంగా పారదర్శకమైన చర్యలు ఉండాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
