బ్యూటిషన్ షన్నును అభినందించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

Spread the love

బ్యూటిషన్ షన్నును అభినందించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

నిరుద్యోగ మహిళలకు బ్యూటిషన్ రంగం ఒక వరం లాంటిది ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి.

కోదాడ,

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో షన్ను బ్యూటీ పార్లర్ ఆధ్వర్యంలో బ్యూటీ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బ్యూటిషన్ రంగంలో ముందుకు వెళుతున్న మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐ డిజిటల్ రావడంతో ఎంతోమంది మహిళలు నిరుద్యోగులుగా మారుతున్నారని అలాంటి వారు బాధ పడకుండా ఈ బ్యూటిషన్ రంగం ఒక వారం లాంటిది అన్నారు. రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలకు సన్మానం చేసి అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బ్యూటిషన్ షన్నును కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో మహిళల కోసం బ్యూటిషన్ రంగం అభివృద్ధికి దోహద పడేలా ఒక ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు హరి, రమా,రామ్ చరణ్, మేకప్ ఆర్గనైజేషన్ షన్ను, మేకప్ సపోర్టింగ్ టీం కళ్యాణి, రమ్యశ్రీ, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top