
ప్రసవం వేళ ఊపిరి కష్టమైనా.. తల్లీబిడ్డను కాపాడిన వైద్యులు
పోలియో, వెన్నెముక వంకర, ఊపిరితిత్తుల వ్యాధి, పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న 37 ఏళ్ల గర్భిణికి విజయవంతంగా ప్రసవం
సూర్యాపేట జిల్లా/కోదాడ
తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు, పల్మనరీ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న 37 ఏళ్ల గర్భిణికి మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా ప్రసవం నిర్వహించారు. కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు.
చిన్ననాటి నుంచి పోలియోతో పాటు కైఫోస్కోలియోసిస్ (వెన్నెముక వంకర), రిస్ట్రిక్టివ్ లంగ్ డిసీజ్, టైప్-2 రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్న సదరు మహిళ 34 వారాల 4 రోజుల గర్భంతో తీవ్రమైన శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో ఆమెను ఐసీయూలో చేర్చి బీఐపీఏపీ ద్వారా శ్వాస సహాయం అందిస్తూ నిరంతరం పర్యవేక్షించారు.
పల్మనాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ, అనస్థీషియా, నియోనాటాలజీ విభాగాలకు చెందిన నిపుణులు సమన్వయంతో చికిత్స అందించారు. అనంతరం రీజినల్ అనస్థీషియా ద్వారా సిజేరియన్ నిర్వహించగా, 2.2 కిలోల బరువున్న మగ శిశువు సురక్షితంగా జన్మించాడు.
ప్రసవం అనంతరం కూడా తల్లిని ఐసీయూలో ఉంచి బీఐపీఏపీ ద్వారా శ్వాస సహాయం కొనసాగించారు. ఆరోగ్యం మెరుగుపడిన అనంతరం ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్యులు తెలిపారు.
అత్యంత క్లిష్టమైన హైరిస్క్ గర్భధారణను వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణుల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది.
ఈ సమావేశంలో డాక్టర్లు రామకృష్ణ, యుగంధర్ బట్టు, మేనేజింగ్ డైరెక్టర్ వాసు కిరణ్ రెడ్డి, వెంకటరత్నాకర్ తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
