వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి…. ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు

Spread the love

వృద్ధాప్యాన్ని సంతోషంగా గడపాలి…. ఘనంగా విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకలు

సూర్యాపేట జిల్లా/ కోదాడ
రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య..
విశ్రాంత ఉద్యోగులు ఆరోగ్యకరమైన అలవాట్లతో తమ వృద్ధాప్య జీవితాన్ని సంతోషంగా గడపాలని అ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రావేళ్ల సీతారామయ్య అన్నారు. కోదాడ పట్టణంలోని సంఘ భవనంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన సెప్టెంబర్ నెలలో జరుపుకునే విశ్రాంత ఉద్యోగుల సామూహిక జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.సుదీర్ఘ కాలం ప్రభుత్వానికి సేవలు అందించిన పెన్షనర్లు విశ్రాంతి జీవితంలో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ సామాజిక సేవలో భాగస్వాములు కావాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, పెన్షనర్ల హక్కుల పరిరక్షణకు సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు,రాష్ట్ర కౌన్సిలర్ పొట్ట జగన్మోహన్ రావు,ఉపాధ్యక్షులు జి భ్రమరాంబ, గులాం యాస్థాని, బాలేమియా, విద్యాసాగర్ రావు పెన్షనర్లు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top