
యువత భక్తితో పాటు క్రమశిక్షణ కూడా అలవర్చుకోవాలి :: మాజీ ఎమ్మెల్సీ వై వి బి రాజేంద్రప్రసాద్ .
చింతల తోట ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నవినాయక ఉత్సవాల తుదిఘట్టమైన నిమజ్జనం కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని గణేష్ దేవునికి పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ…. వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడు కనుక అదే స్ఫూర్తితో సమాజంలోని కుల, మత,ప్రాంత భేదాలు లేకుండా అందర్నీ ఏకం చేసే బాధ్యత యువత తీసుకోవాలని అన్నారు. శోభాయాత్రలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, అందరూ ప్రశాంతంగా ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. మద్యం,మత్తు పదార్థాలు కు దూరంగా ఉండి, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతకు సహకరించాలని రాజేంద్రప్రసాద్ కోరారు
.
ఈ కార్యక్రమంలో… జంపాన శివయ్య, రాజుల పాటిఫణి, జంపాన రుద్రయ్య మురాల అయ్యా ఆరేపల్లి నాగరాజు,జంపాన తేజ తదితరులు పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
