
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని దత్తాత్రయ కాలనీ లో నిర్వహిస్తున్న ఆన్లైన్ ద్వారా కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా చేయించుకోవలసిన ఎంక్వైరీ ప్రక్రియను డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఆగస్టు నెలనుండి ఆన్లైన్ విధానం ద్వారా కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారు తప్పనిసరిగా ఎంక్వైరీ ని పూర్తిచేసుకోవాలని అన్నారు. ఇందు కొరకు మీ దగ్గరలో ఉన్న క్రింది సూచించిన కేంద్రాలకు మీరు స్వయంగా వెళ్లి మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు సమర్పించిన అన్ని పత్రాలను తీసుకునివెళ్ళి ఎంక్వైరీ విధానాన్ని పూర్తిచేసుకోవాలని తెలియచేశారు. ఎంక్వైరీ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత నూతనంగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ పెన్షన్ త్వరలో వస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో C.O ముస్తఫా, బి.ఎల్.ఓ లు, బి.ఎల్. ఎ లు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రాలు:
- శంషిగూడ వార్డ్ ఆఫీస్
- దత్తాత్రయ కాలనీ సాయిబాబా టెంపుల్
- అల్విన్ కాలనీ ఫేస్ 2 కామ్యూనిటీ హల్
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
