తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి

Spread the love

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఎన్నికల కమీషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ శ్రేణులు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఈసీ కార్యాలయం ఎదుట నిరసన

తక్షణమే జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్

భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేష్ కుమార్ అవలంబిస్తున్న ధోరణిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రధాన ఎలక్షన్ కమీషనర్ కార్యాలయం ఎదుట యువజన కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టి, జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా జక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తూ దేశంలో దాదాపు 14 కోట్ల ఓట్లను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ అక్రమ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారని అన్నారు.జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిబ్ ఆదేశాల మేరకు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టుతున్నామని అన్నారు.

తక్షణమే కేంద్రప్రభుత్వం స్పందించి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలని లేనిచో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

You cannot copy content of this page

Scroll to Top