
బతుకమ్మ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించి పలు సూచనలు
వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఆర్కాసాయికుంట బతుకమ్మ నిర్వహణ కోసం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పరిశీలించారు.స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థలంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారి తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చర్చించారు. ప్రజలకు, మహిళలకు ఉపయోగకరంగా ఉండేలా స్థలాన్ని అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఈ కార్యక్రమానికి అనువైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, మహిళ అధ్యక్షురాలు అనిత, సీనియర్ నాయకులు మర్రి ప్రభాకర్, చింత రమేష్, సంధ్య, డివిజన్ ముఖ్య నాయకులు,సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
