కట్కూరి ప్రశాంత్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Spread the love

కట్కూరి ప్రశాంత్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …

కడిపికొండ గ్రామ పార్టీ మాజీ అధ్యక్షులు కట్కూరి రమేష్ కుమారుడు ప్రశాంత్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలుసుకున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కే.ఆర్. నాగరాజు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.ఈ సందర్భంగా ప్రశాంత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే , త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో 44 డివిజన్ అధ్యక్షులు జక్కుల సదానందం, 45వ డివిజన్ అధ్యక్షులు కర్ర హరీష్ రెడ్డి, పాక్స్ చైర్మన్ గంగుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ బెస్కే శ్రీలేఖ, మాజీ అధ్యక్షులు సదానందం, మాజీ బ్లాక్ అధ్యక్షులు నర్మెట వెంకటరమణ, వేణు, శ్రీనివాస్, రాము, వినయ్, జీవన్, దయాకర్, సత్తిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top