జనసేనలో బొద్ధపు వెంకటరమణకు కీలక బాధ్యతలు!

Spread the love

జనసేనలో బొద్ధపు వెంకటరమణకు కీలక బాధ్యతలు!

స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీలో నియామకం.. పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు

పెందుర్తి, : జనసేన పార్టీ పెందుర్తి అసెంబ్లీ స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీలో నిర్వాహక దళ్ కార్యనిర్వాహకుడిగా తనకు బాధ్యతలు అప్పగించడంపై బొద్దపు వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర కోఆర్డినేటర్ నాదెండ్ల మనోహర్, పెందుర్తి ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, స్థానిక ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాల సమన్వయానికి, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి అంకితభావంతో పనిచేస్తానని వెంకటరమణ పేర్కొన్నారు. తనకు సహకరించిన స్థానిక నాయకులు, పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top