బతుకమ్మ, దుర్గాదేవి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

బతుకమ్మ, దుర్గాదేవి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ రంగారెడ్డి నగర్ డివిజన్‌ హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుని, మహిళలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, మహిళల ఐక్యతను చాటిచెప్పే ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానం కలిగి ఉందన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, సంతోషం నింపాలని ఆకాంక్షించారు.

అనంతరం గిరి నగర్ డివిజన్‌లో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు..

స్థానిక కాంగ్రెస్ నాయకులు మోతే శ్రీనివాస్ యాదవ్, ఆర్వ వెంకట్ రమణ, పింటు, శ్యామల, రామగిరి రాకేష్, రిజ్వాన్ కమిటీ సభ్యులు బాలరాజు, ఉపేందర్, పారిష వేణు, రమణ రెడ్డి, నాగన్న, దీపక్ తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top