
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ కి జన్మదిన వేడుకలలో పాల్గొన్నా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి||
, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ జన్మదినోత్సవం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి వారిని శాలువాతో సత్కరించి, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తల సమక్షంలో జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధిస్తూ, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో DCC సభ్యులు, జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, SC, ST, NSUI, INTUC విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
