ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల గెలుపులక్ష్యంగా మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ఇంటింటి ప్రచారం

Spread the love

ఉయ్యూరులో టీడీపీ అభ్యర్థుల గెలుపులక్ష్యంగా మాజీ ఎమ్మెల్సీ వైవిబి రాజేంద్రప్రసాద్ ఇంటింటి ప్రచారం.

15వ వార్డులో టీడీపీ చైర్మన్ అభ్యర్థి చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్, 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చనపతి కల్పనా రాణి విజయాన్ని కోరుతూ ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ఉయ్యూరు మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుకు టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. చైర్మన్ అభ్యర్థి ప్రవీణ్ కుమార్‌తో పాటు కౌన్సిలర్ అభ్యర్థి కల్పనా రాణిని భారీ మెజార్టీతో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.

టీడీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, ఉయ్యూరులో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేస్తున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ వల్లభనేని నాని, చెదుర్తిపాటి శ్యామల , కల్పనా రాణి, వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్,రత్నం శివప్రసాద్,పండు అజ్మతుల్లా,శ్రీనివాస్,ఫణి, జగరోటు నాగరాజు,మేడిశెట్టి మస్తాన్, అప్పలనాయుడు, బత్తుల కామేశ్వరరావు,వెంటప్రగణ వీరాంజనేయులు, మహాచేటి శ్రీనివాస్, దుర్గాప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top