
శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు దసరా పర్వదినం శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీ లో దసరా పర్వదినం ను పురస్కరించుకొని జరిగిన రావణ దహనం కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలకు, తాజా మాజీ కార్పొరేటర్లకు,ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు,,పాత్రికేయ మిత్రులకు, అభిమానులకు, శ్రేయబిలాషులకు దసరా పర్వదినం శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పావన పర్వదినమే దసరా పండుగ లేదా విజయదశమి అని పిలుస్తారు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు. శ్రీదేవి నవరాత్రుల శుభవేళ జగన్మాత దివ్య ఆశీస్సుల ప్రసరించి, మన జీవితాల్లోని చీకట్లను తొలగిస్తాయి అని, అమ్మ వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అంత మంచే జరగాలని కోరుకుంటున్నాను అని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు .
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే విజయదశమి రోజు నిర్వహించే వాహన, ఆయుధ పూజకు విశిష్టమైన స్థానం ఉందని, అందుకే వృత్తి పరమైన పనిముట్లు, పరికరాలను పూజించడం ఆనవాయితిగా వస్తుందని PAC చైర్మన్ గాంధీ పేర్కొన్నారు. దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యంతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా విరాజిల్లాలని ఆకాంక్షించారు. ఈ విజయదశమి పర్వదినం ప్రజలందరికీ శుభప్రదం కావాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అని. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకుంటారు అని PAC చైర్మన్ గాంధీ తెలిచేశారు,
దసరా పండుగ సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగినది అని, రావణ దహనం లు జరిపే ప్రదేశాల్లో నిర్వాహకులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని , ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగ ను ప్రశాంత వాతావరణంలో పండుగ ను జరుపుకోవాలని, కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా దసరా పండుగను జరుపుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ,కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
