ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన ఆటో యూనియన్ సభ్యులు…

Spread the love

ఆటో కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని కలిసిన ఆటో యూనియన్ సభ్యులు…

మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు , బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండిమైసమ్మ, భౌరంపేట్ ప్రాంతానికి చెందిన ఆటో సంఘం ప్రతినిధులు భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ని కలిశారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, జీవనోపాధిపై పడుతున్న ప్రభావాన్ని ఆయనకు వివరించారు.

ప్రభుత్వం ఆటో కార్మికులకు ప్రతి ఆటోకు సంవత్సరానికి రూ.12,000 చొప్పున అందిస్తామని ప్రకటించిన ఆర్థిక సహాయానికి సంబంధించిన పెండింగ్ బకాయిలను విడుదల చేసేలా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల పోటీ కారణంగా ఆటో కార్మికుల ఆదాయం తగ్గి, కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల సమస్యలను సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి, పెండింగ్ ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడంతో పాటు తమ జీవనోపాధికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటో యూనియన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top