సంవిధాన్ రక్షా మార్చ్‌కు షాపూర్ నగర్ నుంచి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
జెండా ఊపి మార్చ్‌ను ప్రారంభించిన డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్
▪️భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ ఆదేశాల మేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపుతో నిర్వహిస్తున్న ‘సంవిధాన్ రక్షా మార్చ్’ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
▪️ఈ సందర్భంగా ఈరోజు షాపూర్ నగర్ నుంచి ట్యాంక్‌బండ్‌పై నిర్వహించనున్న సంవిధాన్ రక్షా మార్చ్‌లో పాల్గొనేందుకు డీసీసీ ఉపాధ్యక్షులు కూన శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి కాంగ్రెస్ శ్రేణుల వాహనాలను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి బయలుదేరారు.

▪️ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కల్పించిందని, రాజ్యాంగంలోని విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సంవిధాన్ రక్షా మార్చ్‌లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
▪️ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
