రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకుందాం.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్.
77 వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేడు జగద్గిరిగుట్ట చివరి బస్ స్టాప్ వద్ద సిపిఐ మరియు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ పీఠికను చదివి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని ప్రమాణం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు పొందిన బాబు మరియు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డులు పొందిన ఆంధ్రజ్యోతి నాగేశ్వరరావు ఈనాడు శ్రావణ్ లను సత్కరించి సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లే నేడు భారతదేశంలో ఒక ఓటు ఒక విలువ అనేది కల్పించబడ్డదని కానీ రాజ్యాంగంలో పొందుపరిచినట్టు సమన్యాయం అనేది ఇంకా ప్రజలకు దూరంలోనే ఉన్నదని అన్నారు. చట్టాలు చేసే పరిపాలకులు కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు చేయడం వల్ల నేడు దేశం మరియు దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు పెట్టుబడిదారుల , గుత్తాధిపత్యం చేతిలోకి వెళ్లిపోయారని దానికి నిదర్శనమే అంబానీ, ఆదానీలకు రాయతీలిచ్చి బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చి తిరిగి వాటిని మాఫీ చేయడం ఈ దేశంలో సర్వసాధారణమైపోయిందని అన్నారు. అదే పేద మధ్యతరగతి ప్రజలు బ్యాంకుల ద్వారా లోన్లు పొందుతే వారి ఆస్తులను జప్తు చేసి వారిని సమాజంలో ప్రజలకు మోసం చేసిన వారిగా చిత్రీకరిస్తున్నారని అదేవిధంగా వీరికి ఇచ్చే సబ్సిడీలు ఎందుకని బిజెపి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు పనిచేసే కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. ఇలాంటి అనాలోచితమైనటువంటి ప్రకటనల వల్ల పేద మధ్యతరగతి ప్రజలు నష్టపోయి పెట్టుబడిదారులు లాభపడుతున్నారని గ్రహించాలని ఆర్ఎస్ఎస్ బిజెపి కార్యకర్తలకు సూచించారు. దేశంలో నేడు అసమానతలు తీవ్రంగా పెరిగిపోయిందని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయని, బావ స్వాతంత్ర ప్రకటన, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, అందరికీ సమన్యాయం లాంటి హక్కులు మరింత క్షీణించాయని వీటన్నింటిని గ్రహించిన యువత నేడు బిజెపికి దూరమవుతుందనడానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటాలు నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో కూడా ప్రజలు సంఘటితమై తమ హక్కులను పరిరక్షించుకోవడానికి పోరాటం చేయాలని రాజ్యాంగ హక్కులను పరిరక్షించుకున్న నాడే రాజ్యాంగ నిర్మాతల యొక్క ఆశయాలు నెరవేరుతాయి అని అన్నారు.
ఈ కార్యక్రమానికి గణేష్ అధ్యక్షత వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు నరసింహారెడ్డి, దళిత సంఘాల నాయకులు మల్లేష్, బాబు ,నరసింహులు, జర్నలిస్టు సంఘాల నాయకులు యాకయ్య, డప్పు రామస్వామి, తొండ వెంకట్, యువజన కాంగ్రెస్ నాయకులు సాయి పంతుల, సిపిఐ నాయకులు సదానంద, కే వెంకటేష్ ఏం సహదేవరెడ్డి, మహేందర్, శ్రీనివాస్ చారి, నర్సయ్య, భీమేష్ జార్జ్, బాలయ్య, అఖిల భారత యువజన సమైక్య అధ్యక్షులు ప్రవీణ్, స్థానిక నాయకులు ముసలయ్య సామిల్ యాదగిరి బాలాజీ సుదర్శన్ సోమయ్య లతో పాటు పలువురు పాల్గొనడం జరిగింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
