సంవిధాన్ రక్షా మార్చ్‌లో పాల్గొన్న కొలన్ హన్మంత్ రెడ్డి
నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు హైదరాబాద్‌లో నిర్వహించిన భారీ సంవిధాన్ రక్షా మార్చ్‌లో *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి గారు, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గార్లు పాల్గొన్నారు.

లిబర్టీ సర్కిల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన ఈ మార్చ్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బి.ఎం. సందీప్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ……. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, INTUC, NSUI నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
